సానికవరం గ్రామం

1 / 3
sanikavaram-bus-stop
సానికవరం
1 / 3
sanikavaram-Ramalayam
రామాలయం
2 / 3
sanikavaram-anjaneya-temple
ఆంజనేయ స్వామి గుడి
3 / 3
sanikavaram-main-road

సానికవరం గ్రామం

  • మండలం: పెద్దారవీడు
  • జిల్లా: ప్రకాశం
  • రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్
  • ప్రకాశం జిల్లాలోని నల్లమల అడవుల సమీపంలో, చుట్టూ ఎత్తైన కొండల మధ్య, పంట పొలాలతో, చెరువులతో, వాగులతో ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు సానికవరం గ్రామం.

    సానికవరం గ్రామం ఎర్రగొండపాలెం నియోజకవర్గం, పెద్దారవీడు మండలం, మార్కాపురం పట్టణానికి దాదాపు 29 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఒంగోలు పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్నది. దక్షిణ భారతదేశంలో పేరు గాంచిన ప్రముఖ దేవాలయం శ్రీశైల క్షేత్రానికి దాదాపు 59 కిలోమీటర్ల ఉంది సానికవరం గ్రామం.

    2011 జనాభా లెక్కల ప్రకారం సానికవరం గ్రామ జనాభా 5,996 ఉండగా, 1,451 ఇళ్ళు ఉన్నాయి. సానికవరం యొక్క భౌగోళిక విస్తీర్ణం 2,904 హెక్టార్లు.

    వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. పూర్వం జొన్న, రాగి, సజ్జ, అరికెలు, కొర్రలు, వరి మొదలగు పంటలను పుష్కలంగా పండించేవారు ఇక్కడి రైతులు. కానీ కాలానుగుణంగా, పత్తి, మిరప పంటలను ప్రధానంగా పంటలుగా మార్చుకున్నారు. ముఖ్యంగా ఇక్కడి వ్యవసాయం వర్షపు నీరు మరియు బోర్ వెల్ మీద ఆధారపడి ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా అనావృష్టి పీడిస్తున్న కారణంగా రైతులు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక్కడి పంట పొలాలకు నీరు అందించడానికి తలపెట్టిన వెలుగొండ ప్రాజెక్ట్ కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

    పంజాబ్ నేషనల్ బ్యాంకు సానికవరం గ్రామంలో నెలకొల్పబడినది. IFSC CODE-PUNB0282100.

    ZPH SCHOOL సానికవరం 1986 సంవత్సరంలో స్థాపించబడినది. ప్రస్తుతం ఇందులో తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాలు బోధించబడుతున్నాయి.


    Sanikavaram Village

  • Block / Tehsil : Peda Araveedu
  • District: Prakasam
  • State : Andhra Pradesh
  • About Sanikavaram

    Sanikavaram is an alluring village located in the Prakasam district, near the Nallamala forests, amidst the surrounding of high hills, with crop fields, ponds and streams.

    Sanikavaram village is located in Yerragondapalem constituency, Peddaraveedu Mandal, about 29 km from Markapuram town in the state of Andhra Pradesh. The town of Ongole is the district headquarters. Sanikavaram village is located at a distance of about 59 km from Srisailam, a famous temple in South India.

    According to the 2011 census, Sanikavaram village has a population of 5,996 and 1,451 households. The geographical total area of Sanikavaram is 2,904 hectares.

    Agriculture is the main occupation of the people here. In the past, the farmers here used to cultivate plenty of crops like Sorghum, Barja, Rai, Millets, Kodo Millets, Paddy etc. But over time, Cotton and Chilli became the main crops. Agriculture here in is heavily dependent on rainwater and borewells. Farmers are facing severe water scarcity due to drought conditions for the last few years. Farmers are looking forward to the completion of Velugonda project, which aims to provide water to the crop fields here.

    India's one of the largest bank PUNJAB NATIONAL BANK is located here in Sanikavaram with IFSC code: PUNB0282100

    ZPH School, Sanikavaram established in 1986, moreover the curriculum starts from 6th to 10th class. Initially it was started being a Telugu Medium, later English Medium also included.








    గుంటూరు‌: ప్రముఖ డైరెక్టర్‌ క్రిష్‌ తెరకెక్కించిన ‘వేదం’ చిత్రంలో పల్లెటూరి వృద్ధుని పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించిన నాగయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం గుంటూరు జిల్లా దేచవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాగయ్య ‘వేదం’ సినిమాలో రాములు పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఆ తర్వాత ఆనేక చిత్రాల్లో ఆయనకు అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ‘వేదం’ చిత్రంలో ‘పద్మ మన పైసలు దొరికాయే..నీ బిడ్డ సదువుకుంటాడే’, ‘ఇళ్లు కట్టేవాడికి ఇల్లుంటుందా, చెప్పులు కుట్టేవాడికి చెప్పులుంటాయా.. మాపరిస్థితి కూడా అంతే’ డైలాగులు‌ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాగయ్య 30కిపైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు.
    ఇంటర్నెట్‌ డెస్క్‌: పాన్‌ ఇండియా సినిమాలకు టాలీవుడ్‌ అడ్డాగా మారుతోంది. మన హీరోలు ఇప్పటికే అరడజను పాన్‌ఇండియా సినిమాలతో సిద్ధమయ్యారు. ఇప్పుడు.. టాలీవుడ్‌ నుంచి మరో భారీ పాన్‌ ఇండియా చిత్రం రాబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. సక్సెస్‌ఫుల్‌ హీరో.. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌తో కలిసి ఓ సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్న ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాది హద్దులు దాటి ఉత్తరాదిలోనూ స్టార్‌గా మారిన ప్రభాస్‌తో క్రేజీ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ ‘సలార్‌’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దిల్‌రాజు ‘సలార్‌’ కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్టును ప్లాన్‌ చేస్తున్నారట. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రాన్ని తీసుకురావాలని యోచిస్తున్నారట. ప్రభాస్‌ కూడా దిల్‌రాజుతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వార్తల గురించి ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ వీళ్ల ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా వస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమనే చెప్పాలి. కాగా.. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘రాధేశ్యామ్‌’ సినిమాలున్నాయి. అంతేకాదు.. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌తో మరో సినిమా చేసేందుకు ప్రభాస్‌ సంతకం చేశాడు. ప్రశాంత్‌నీల్‌ సైతం.. తర్వాత సినిమాను ఎన్టీఆర్‌తో చేయనున్నట్లు ప్రకటించాడు. అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్‌రాజు విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘ఎఫ్‌3’, హిందీలో ‘జెర్సీ’ సినిమాలు నిర్మిస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు కూడా. మరి ఈ వార్తలు నిజం కావాలని కోరుకుందాం.